దిల్ రాజు చెప్పిన ‘96’ స్టోరీ

Friday,February 01,2019 - 10:03 by Z_CLU

తమిళ సూపర్ హిట్ సినిమా ‘96’ రీమేక్ ఆల్మోస్ట్ సెట్స్ పైకి రావడానికి రెడీగా ఉంది. హీరోగా శర్వానంద్, సమంతా హీరోయిన్ గా అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అయితే అటు తిప్పి ఇటు తిప్పి ఈ సినిమాపై ఉండాల్సిన కాన్సంట్రేషన్ దిల్ రాజు పై మళ్ళుతుంది. దానికి రీజన్ ఇది ఆయన కరియర్ లో ఫస్ట్ ఎవర్ రీమేక్ అవ్వడం.

నిజానికి ‘96 సినిమాని చూసీ చూడగానే ఇంప్రెస్ అయిన దిల్ రాజు ఇమ్మీడియట్ గా ప్రొడ్యూసర్ తో సంప్రదింపులు జరిపేసి, ఈ సినిమా డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తో అక్కడికక్కడే ఈ సినిమాని తెలుగులో కూడా నువ్వే డైరెక్ట్ చేస్తున్నావు అని చెప్పేశాడట. ఈ విషయన్ని స్వయంగా మీడియాతో షేర్ చేసుకున్నాడు దిల్ రాజు.

‘ఒక ఫీల్ ని సినిమా బిగినింగ్ నుండి చివరి వరకు దర్శకుడు ట్రావెల్ చేయించిన విధానం అద్భుతం. సినిమాలో ఒక మంచి ఫీల్ ఉంది. తెలుగు వాళ్లకు కూడా ‘96’ తప్పకుండా కనెక్ట్ అవుతుంది’. అని కాన్ఫిడెంట్ గా చెప్పుకున్నాడు దిల్ రాజు. ఇప్పటివరకు రీమేక్ అంటూ చేయని దిల్ రాజు ను కూడా, ఇంప్రెస్ చేసిన ఈ సినిమాపై టాలీవుడ్ లో కూడా ఇప్పుడిప్పుడే చిన్నగా వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి.