కీర్తిసురేష్, ఆది పినిశెట్టి మూవీ అప్ డేట్స్

Monday,July 15,2019 - 12:57 by Z_CLU

కీర్తి సురేశ్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు న‌గేశ్ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ బేస్డ్ రొమాంటిక్ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఇప్పుడీ ప్రాజెక్టులోకి దిల్ రాజు కూడా చేరారు. ఈ సినిమాను తన సొంత బ్యానర్ పై దిల్ రాజు ప్రజెంట్ చేయబోతున్నారు.

`హైద‌రాబాద్ బ్లూస్‌`,`ఇక్బాల్‌` వంటి సినిమాల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన బాలీవుడ్ డైరెక్ట‌ర్ న‌గేశ్ కుకునూర్‌. ఈయ‌న కీర్తి సురేశ్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్నచిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నారు.

స్పోర్ట్స్ జోన‌ర్‌లో రొమాంటిక్ ఎలిమెంట్స్ తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఆగ‌స్ట్‌లో చివ‌రి షెడ్యూల్‌ను చిత్రీక‌రించ‌నున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి చిరంత‌న్ దాస్ సినిమాటోగ్రాఫ‌ర్‌.

సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌క‌త్వం: న‌గేశ్ కుకునూర్‌
స‌మ‌ర్ప‌ణ‌: దిల్‌రాజు(శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌)
బ్యాన‌ర్‌: వ‌ర్త్ ఏ షాట్ మోష‌న్ ఆర్ట్స్‌
నిర్మాత‌: సుధీర్ చంద్ర‌
కో ప్రొడ్యూస‌ర్‌: శ్రావ్యా వ‌ర్మ‌
మ్యూజిక్‌: దేవిశ్రీ ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: చిరంత‌న్ దాస్‌