ఏడాదికి 5 సినిమాలు.. ఈసారి పక్కా

Monday,December 09,2019 - 04:55 by Z_CLU

ప్రతీ ఏడాది ఒక టార్గెట్ పెట్టుకొని సినిమాలు చేస్తుంటారు బడా నిర్మాత దిల్ రాజు. 2017 లో ఏకంగా ఆరు సినిమాలు రిలీజ్ చేసి నిర్మాతగా చెక్కుచెదరని రికార్డు నెలకొల్పారు. అదే స్పీడ్ తో గతేడాది పనిచేసినప్పటికీ ఐదు సినిమాలు చేయలేకపోయారు. ఈ ఏడాది కూడా ఓ ఐదు సినిమాలు ప్లాన్ చేశారు కానీ మూడు సినిమాలతోనే సరిపెట్టుకున్నారు.

దిల్ రాజు బ్యానర్ నుండి ఈ ఏడాది ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ డెలివరీ అయ్యాయి. జనవరిలో రిలీజైన ‘F2’ఔరా అనిపించే కలెక్షన్స్ సాదించి సంక్రాంతి బ్లాక్ బస్టర్ అనిపించుకోవడంతో పాటు దిల్ రాజు కెరీర్ లోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచింది. ‘మహర్షి’ సమ్మర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘ఇద్దరి లోకం ఒకటే’ డిసెంబర్ 25 న థియేటర్స్ లోకి రాబోతుంది.

ఇలా ఈ ఏడాది మూడు సినిమాలతోనే సరిపెట్టుకున్నా వచ్చే ఏడాది మాత్రం తన 5 సినిమాలు టార్గెట్ ను రీచ్ అవ్వబోతున్నారు. 96 రీమేక్ ఆల్రెడీ సెట్స్ పై ఉంది. నాని-సుధీర్ బాబుతో చేస్తున్నV సినిమా దాదాపు కొలిక్కి వచ్చింది. వీటితో పాటు వీవీ వినాయక్ హీరోగా సినిమా కూడా శరవేగంగా రెడీ అవుతోంది. ఈ 3 సినిమాలు 2020 తొలి అర్థబాగంలోనే థియేటర్లలోకి రావడం పక్కా.

మిగిలిన 6 నెలల్లో 2 సినిమాల్ని రిలీజ్ చేయగలిగితే దిల్ రాజు టార్గెట్ రీచ్ అయినట్టే. దీనికి సంబంధించి ఇప్పటికే విజయ్ దేవరకొండ సినిమాతో మొదలుపెట్టి శిరీష్ అబ్బాయి ఆషిష్ ను హీరోగా పరిచయం చేసే మూవీ వరకు చాలా సినిమాలు పైప్ లైన్లో ఉన్నాయి.

సో.. వచ్చే ఏడాది స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన మేజిక్ ఫిగర్ (5 సినిమాలు) అందుకోవడం గ్యారెంటీ.