దిల్ రాజు సినిమా ఎవరితో ?

Sunday,September 24,2017 - 12:50 by Z_CLU

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు- సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ‘శతమానం భవతి’ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే.. సంక్రాంతి బరిలో సూపర్ హిట్ గా నిలిచి బెస్ట్ పాపులర్ తెలుగు ఫిలిం కేటగిరిలో నేషనల్ అవార్డు అందుకున్న ఈ సినిమా తర్వాత సతీష్ వేగేశ్న తో మరో సినిమా అనౌన్స్ చేసాడు దిల్ రాజు.. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రస్తుతం  ఓ ఇద్దరు యంగ్ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు హీరోలుగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో పాటు రామ్ పోతినేని పేరు కూడా వినిపిస్తుంది.  పెళ్లి చుట్టూ జరిగే కథతో ఫామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాకు ‘శ్రీనివాస కళ్యాణం’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసిన యూనిట్ హీరో ఎవరనే విషయం పై మాత్రం ఇంకా క్లారిటీ సస్పెన్స్ మైంటైన్ చేస్తున్నారు. మరి ఈ ఇద్దరిలో దిల్ రాజు  ఏ హీరోతో ఈ సినిమాను తెరకెక్కిస్తాడో… తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.