‘ఇండియన్ 2’ నుండి అందుకే తప్పుకున్నా- దిల్ రాజు

Tuesday,December 19,2017 - 10:03 by Z_CLU

ఇప్పటి వరకు టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్న దిల్ రాజు ఈ ఇయర్ స్పీడ్ ఉన్న ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు. ఈ ఇయర్ ఏకంగా 6 సినిమాలను రిలీజ్ చేసిన దిల్ రాజు, అదే స్పీడ్ తో 2018 కి ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే రీసెంట్ గా కమలహాసన్ ‘ఇండియన్ 2’ సినిమాని నిర్మిస్తున్నట్టు అనౌన్స్ చేసిన దిల్ రాజు ఆ సినిమా నుండి తప్పుకున్నారు.

‘గతంలో డైరెక్టర్ శంకర్ తో సినిమా చేద్దామని అడిగాను. అది మైండ్ లో పెట్టుకుని ఈ సినిమా కోసం శంకర్ నాకా చాన్స్ ఇచ్చాడు. వెంటనే ఒప్పుకున్నా, కాకపోతే నా మెంటాలిటీకి అది సూట్ అవ్వదు.చివరికి అదొక భారీ సినిమా అనిపించుకుంటుంది తప్ప నా సినిమా అనిపించుకోదు. అందుకే ఈ సినిమా నుండి తప్పుకున్నాను’ అని చెప్పుకున్నారు దిల్ రాజు.

ప్రస్తుతం M.C. A. ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న ఈ ప్రొడ్యూసర్, ఈ సినిమా కూడా సూపర్ హిట్ గ్యారంటీ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. 2018 లో మరో ఇద్దరు డైరెక్టర్స్ ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు దిల్ రాజు.