దిల్ రాజు ఇంటర్వ్యూ

Monday,July 17,2017 - 03:31 by Z_CLU

వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, ఫిదా అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. శేఖర్ కమ్ముల, దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న ఫిదా సినిమాలో వరుణ్ తేజ, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాపై ప్రొడ్యూసర్ దిల్ రాజు కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు.

 

ఎప్పటి నుంచో

శేఖర్ కమ్ములతో ఎప్పటినుంచో ఓ సినిమా చేయాలనుకున్నాను. కానీ ఆయనకీ నాకు సూట్ అవుతుందా అవ్వదా అని చాలా సార్లు ఆలోచించాను. ఫైనల్ గా ఇన్నాళ్లకు కుదిరింది. కమ్ముల తన సొంత బ్యానర్ లోనే సినిమాలు చేస్తుంటారు. లీడర్ ఒక్కటే బయట బ్యానర్ కి చేశాడు. అదే టైంలో బయట బ్యానర్ లో చేస్తున్నావ్ కదా మా బ్యానర్ లో కూడా సినిమా చెయ్యండి. ఎప్పుడైనా స్క్రిప్ట్ ఉంటే చెప్పండి అని అడిగాను. ఫైనల్ గా ఆయన ఫిదా స్క్రిప్ట్ వినిపించారు. బాగా నచ్చింది. హ్యాపీ డేస్ టైం లో మా ఇద్దరికీ బాగా కుదరడంతో ఈ సినిమా మా కాంబినేషన్ లో వస్తే బాగుంటుందని ఫిక్స్ అయ్యాం.

 

చాలా ఏళ్ల తర్వాత

చాలా ఏళ్ల తర్వాత శేఖర్ నుంచి వస్తున్న అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ ఇది. నిజానికి ఈ మధ్య శేఖర్ గారి నుంచి ఇలాంటి లవ్ స్టోరీ రాలేదు. ఈ సినిమా కంప్లీట్ గా హీరో హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ తో ఫామిలీ ఎమోషన్ తో మాత్రమే ఉంటుంది. ఇక శేఖర్ గారు ఎప్పుడూపెద్దగా కథ రాయరు. జస్ట్ మూవ్ మెంట్స్ రాసుకుంటారు. వాటి పైనే స్క్రిప్ట్ బేస్ చేసి రాస్తారు. ఈ కథలో ఆ మూమెంట్స్ బాగా నచ్చాయి. ఓవరాల్ గా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా సినిమాగా ‘ఫిదా’ చేస్తుంది.


ముగ్గురు స్టార్ హీరోలు విన్నారు

ఫిదా కథ ముందుగా ఓ ముగ్గురు స్టార్ హీరోలకు వినిపించాం. శేఖర్ కమ్ముల ఈ స్క్రిప్ట్ ఎవరైనా స్టార్ హీరోతో చేయాలనీ అనుకుంటున్నానని చెప్పగానే నేనొక హీరోని సజెస్ట్ చేసి కథ చెప్పించాను. ఆయన కూడా పర్సనల్ గా ఓ ఇద్దరు స్టార్స్ హీరోలను కలిసి స్క్రిప్ట్ వినిపించాడు. విన్న అందరికి స్క్రిప్ట్ బాగా నచ్చింది. కానీ తమ ఇమేజ్ కు సూట్ అవ్వదని తప్పుకున్నారు. ఒక అప్ కమింగ్ హీరోతే వెళ్తే బాగుంటుందని శేఖర్ గారికి చెప్పాను. సో ఫైనల్ గా ఈ కథ వరుణ్ కి వినిపించాం. అప్పటికే వెంకీ అట్లూరి తో వరుణ్ మా బ్యానర్ లో సినిమా చేయాలి. కానీ ఆ స్క్రిప్ట్ నిర్మాత బాపి దగ్గరకి పంపించాను. ఫైనల్ గా వరుణ్ కి కూడా ఈ స్క్రిప్ట్ బాగా నచ్చడం, శేఖర్ గారితో చేయాలనీ ఇంట్రెస్ట్ చూపించడంతో అలా ఈ కథ లోకి వరుణ్ వచ్చాడు.

 

ఆయన స్టోరీ కూడా వినలేదు

నిజానికి ఈ సినిమా విషయంలో నాగబాబు గారు మా మీద నమ్మకం పెట్టుకొని కథ కూడా వినకుండానే ఓకే చెప్పారు. లేటెస్ట్ గా ఆయనతో కలిసి ఈ సినిమా చూశాను. ఆయన చాలా హ్యాపీ గా ఫీలయ్యారు. వెంటనే చిరంజీవి గారికి కూడా సినిమా చూపిద్దామని చెప్పి చాలా ఎగ్జైట్ అయ్యారు.

 

వరుణ్ కెరీర్ లో మంచి సినిమా

వరుణ్ ఈ స్క్రిప్ట్ విని ఓకే అనగానే కచ్చితంగా వరుణ్ కెరీర్ లో ఇది ఒక మంచి సినిమా అవుతుందని ఈ సినిమా తనకి బాగా ప్లస్ అవుతుందని భావించాను. ఇప్పుడు సినిమా చూశాక వరుణ్ కి ఇదో పెద్ద హిట్ అవుతుందనిపిస్తుంది.

 

శేఖర్ ఛాయిస్ తనే..

శేఖర్ ఈ స్క్రిప్ట్ చెప్పగానే ముందు హీరోయిన్ పెర్ఫార్మర్ అయి ఉండాలనుకున్నాం. ఈ క్యారెక్టర్ కి సాయి పల్లవి అయితే బాగుంటుందని శేఖర్ ఓ సారి చెప్పాడు. సో తనని కలిస్తే మెడిసిన్ అయ్యే వరకూ సినిమాలు చేయనని చెప్పింది. సో మాకు కూడా స్క్రిప్ట్ వర్క్ కి టైం పడుతుండడంతో ఓకే అన్నాం. సో ఫైనల్ గా స్క్రిప్ట్ పూర్తిగా రెడీ అవ్వడం, తను మెడిసిన్ ఫినిష్ చేయడం ఒకేసారి జరిగాయి. భానుమతి అనే క్యారెక్టర్ తో మెస్మరైజ్ చేసింది. రేపు ఆడియన్స్ కూడా ఆమె పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోతారు. ముఖ్యంగా డబ్బింగ్ కూడా తనే చెప్పుకుంది. ఆ వాయిస్ క్యారెక్టర్ కి ప్లస్ అయింది.

అందుకే ఆలస్యం

ఈ సినిమా చాలా ఆలస్యం అవుతుందని అన్నారు. కానీ నిజానికి వరుణ్ కి కాలు ఫ్యాక్చర్ అవ్వడం, ఇంకో సినిమా ఉండటం వల్లే కాస్త ఆలస్యం అయ్యింది కానీ.. వేరే కారణాలేం లేవు. మేం అనుకున్నదాని కంటే కొన్ని రోజులు మాత్రమే లేట్ అయిందంతే.

 

గ్రేట్ అచీవ్ మెంట్

నిజంగా ఈ ఇయర్ చాలా హ్యాపీ గా ఉంది. మా బ్యానర్ లో వచ్చిన మూవీస్ అన్ని కంటిన్యూస్ గా సూపర్ హిట్స్ అవుతున్నాయి. తీసిన 25 సినిమాల్లో 18 సినిమాలు హిట్స్ అవ్వడం మా అదృష్టం. ఆల్మోస్ట్ ఏడాదిలో 6 హిట్స్ కొట్టడం కూడా మా బ్యానర్ కే కుదిరింది. కెరీర్ లో ఇదో గ్రేట్ అచీవ్మెంట్ గా ఫీలవుతున్నా.

 

అనుకున్న దానికంటే కాస్త ఎక్కువ

సినిమా బడ్జెట్ విషయంలో ఎప్పుడూ ఆలోచించను. నిర్మాతగా ఆడియన్స్ కి ఎప్పుడూ ఒక క్వాలిటీ సినిమా ఇవ్వాలని మాత్రమే ఆలోచిస్తాను. ఈ సినిమా విషయంలో మేం అనుకున్న బడ్జెట్ కంటే కేవలం ఒక 10% మాత్రమే పెరిగింది. అది కూడా కొంచెం ఆలస్యం వల్లే తప్ప మరే కారణం లేదు. నిజానికి చాలా తక్కువ టైంలోనే షూటింగ్ ఫినిష్ చేశాం.

నన్ను నేను మోసం చేసుకోను

నిర్మాతగా ఎప్పుడు ఫేక్ కలెక్షన్స్ చెప్పడం, రాంగ్ ఫిగర్ చెప్పడం నాకు అలవాటు లేదు. సినిమా తీసి డబ్బులు రాకుండా సూపర్ హిట్ అనడం తనని తను మోసం చేసుకోవడమే అవుతుంది. నా విషయంలో అదే ఫీలవుతుంటాను. డబ్బులు రాకపోతే అది ఎంత పెద్ద సినిమా అయినా ఫ్లాపే.అందుకే సినిమా బాగోకపోతే నిర్మాతగా మీడియా ముందుకు కూడా రాను. ఒకవేళ సినిమా బాగుంటే కచ్చితంగా నిర్మాతగా నిజమైన కలెక్షన్స్ చెప్తాను. అంతే కానీ నన్ను నేను ఎప్పుడూ మోసం చేసుకోను.

 

హెల్తీ ఇండస్ట్రీ అవసరం

ఒక హీరోను టార్గెట్ చేసి ఆ సినిమా పై ఏదో కామెంట్స్ చేయడం, డివైడ్ టాక్ స్ప్రెడ్ చేయడం మన కల్చర్ కాదు. అది చాలా తప్పు. ఇండస్ట్రీ ఎప్పుడు హెల్తీ గా ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకడిని. నిజానికి అభిమాని గా కాంపిటీషన్ ఫీలవ్వడం, అలా ఊహించుకోవడం సహజమే కానీ దానికి హద్దులుంటాయి. అవి దాటితే హీరోలే రంగంలోకి దిగాలి. అందరు ఒక్కటే అని, ఫైనల్ గా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడమే టార్గెట్ అని ప్రెస్ మీట్స్ లో ఆడియో ఫంక్షన్స్ లో చెప్తూ ఉండాలి.

రామ్ చరణ్ తో ఉంటుంది..కానీ

రామ్ చరణ్ తో సినిమా ఉంటుంది. కానీ అది ఎప్పుడు స్టార్ట్ చేస్తాం, ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఇంకా చెప్పలేం. త్రినాథరావు నక్కిన డైరక్ట్ చేస్తాడంటూ వచ్చిన వార్తలన్నీ పుకార్లే. ప్రస్తుతం కథ రెడీ అవుతోంది. అఫీషియల్ గా ఎనౌన్స్ చేసేవరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్నీ రూమర్లే.

 

జనవరి నుంచి మహేష్ సినిమా

ప్రెజెంట్ మహేష్ తో ఓ సినిమా నిర్మించబోతున్నాం. జనవరి నుంచి ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలనీ చూస్తున్నాం.