రామ్ సినిమాకు డిఫరెంట్ టైటిల్

Sunday,July 30,2017 - 03:10 by Z_CLU

హైపర్, శివం, నేను శైలజ, కందిరీగ, ఒంగోలుగిత్త.. ఇలా రామ్ నటించిన ఏ సినిమా టైటిల్ తీసుకున్నా అందులో కాస్త కొత్తదనం కనిపిస్తుంది. ఈసారి కూడా రామ్ అదే కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. తన కొత్త సినిమాకు “ఉన్నది ఒక్కటే జిందగీ” అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నాడట రామ్.

ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రామ్. గతంలో వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన నేను శైలజ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అందుకే కిషోర్ తిరుమలకు మరో ఛాన్స్ ఇచ్చాడు రామ్. ఈ సినిమాకే “ఉన్నది ఒక్కటే జిందగీ” అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ టైటిల్ కొత్తగా ఉండడంతో పాటు చాలా ఫ్రెష్ గా కూడా అనిపిస్తోంది.

ఈ సినిమాలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మధ్యే వైజాగ్, హైదరాబాద్ షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగష్టు నుండి ఊటీ షెడ్యూల్ కు వెళ్లనుంది. స్రవంతి రవి కిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో డిఫరెంట్ లుక్ తో ఎట్రాక్ట్ చేయబోతున్నాడు రామ్.