మా సినిమా సైన్స్ కాదు, ఓ చందమామ కథ

Thursday,July 04,2019 - 04:26 by Z_CLU

రెండు బ్రెయిన్స్ తో ఓ మనిషి పుడితే… చూడ్డానికి ఇదేదో సైన్స్ ఫిక్షన్ స్టోరీ అనుకుంటారు ఎవరైనా. కానీ ఇలాంటి క్లిష్టమైన కథను కూడా కామెడీ టచ్ తో వినోదాత్మకంగా చెప్పామంటున్నాడు దర్శకుడు డైమండ్ రత్నబాబు. ఇదే స్టోరీలైన్ తో బుర్రకథ సినిమా తీశాడు ఈ దర్శకుడు.

“ఒక ఫోన్ లో 2 సిమ్ కార్డులున్నప్పుడు, ఒక మనిషికి 2 బ్రెయిన్స్ ఎందుకు ఉండకూడదు. ఈ ఆలోచన నుంచే బుర్రకథ పుట్టింది. వెంటనే నెట్ లో సెర్చ్ చేశాను. 2 బ్రెయిన్స్ తో పుట్టిన 16 మంది కనిపించారు. సో.. నా ఆలోచన యదార్థమైనదే. దాన్నే కథగా రాసుకొచ్చారు.”

ఈ సినిమా స్క్రీన్ ప్లే కోసం చాలా కష్టపడ్డామంటున్నాడు దర్శకుడు. ఏకంగా ఐదుగురు రైటర్స్ ను పెట్టుకొని స్క్రీన్ ప్లే పూర్తిచేశాడట. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడికి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదంటున్నాడు డైమండ్.

“ఇలాంటి కథను సినిమాగా తీయడం కష్టం. మరీ ముఖ్యంగా వినోదాత్మకంగా చెప్పడం మరీ కష్టం. స్క్రీన్ ప్లే రైటర్స్ గా ఐదుగుర్ని తీసుకున్నాను. వాళ్ల సహకారంతో ఇంత కష్టమైన స్క్రిప్ట్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేయగలిగాం. సైన్స్ కష్టంగా ఉంటుంది, కానీ చందమామ కథ ఇష్టంగా ఉంటుంది. మా సినిమా చూస్తే చందమామ బుక్ చదివినట్టు ఉంటుంది.”

ఆమధ్య వచ్చిన సవ్యసాచి సినిమాకు బుర్రకథకు ఎలాంటి సంబంధం ఉండదంటున్నాడు డైరక్టర్. ఇక పూరి తీస్తున్న ఇస్మార్ట్ శంకర్ కు బుర్రకథకు కూడా ఎలాంటి సిమిలారిటీ ఉండకూడదనే కోరుకుంటున్నానని అన్నాడు.