చిరు సినిమాలో మరో రచయిత చేరాడా?

Tuesday,July 19,2016 - 07:22 by Z_CLU

 

మెగా స్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న 150 సినిమా గురించి మరో వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. తమిళ చిత్రం ‘కత్తి’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ రచయితలు గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు గాను మరో రచయిత పై కూడా చిరు భాద్యత పెట్టారని వినికిడి. ఇక ప్రస్తుతం తన మాటలతో ఆకట్టుకుంటున్న సాయి మాధవ్ బుర్ర ఈ సినిమాకు కొన్ని సన్నివేశాలు రాస్తున్నారని టాక్. ‘గోపాల-గోపాల’ చిత్రం లో తన దైన మాటలతో అలరించి పవన్ మనసు దోచేసిన ఈ రచయిత పవన్ తో తాజాగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రానికి కూడా పనిచేశారు. ఇక ఇటీవలే ఈ రచయిత తో తన సినిమాకు రాయించుకోవాలని భావించి ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను రచయిత సాయి మాధవ్ బుర్ర కు చిరు అప్పగించారనే వార్త వినిపిస్తుంది. ఇక పరుచూరి బ్రదర్స్ తో పాటు ప్రస్తుతం మాటలతో ఆకట్టుకొని అలరిస్తున్న సాయి మాధవ్ కూడా ఈ సినిమాకు మాటలు అందిస్తే మాత్రం డైలాగ్స్ దుమ్ము రేపుతాయనడం లో ఎటువంటి సందేహం లేదు అంటున్నారు విశ్లేషకులు.