నాగార్జున సినిమాలో బాలీవుడ్ భామ

Saturday,January 25,2020 - 01:02 by Z_CLU

టాలీవుడ్ కి మరో బాలీవుడ్ భామ పరిచయం కానుంది. త్వరలో సెట్స్ పైకి రానున్న నాగ కొత్త సినిమా ‘వైల్డ్ డాగ్’ లో దియా మీర్జా హీరోయిన్ గా ఫిక్సయింది. రీసెంట్ గా ‘కాఫిర్ అనే వెబ్ సిరీస్ సక్సెస్ తో ఫామ్ లోకి వచ్చిన ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ కి పరిచయం కానుంది.

బేసిగ్గా హైదరాబాదీ అయిన దియా మీర్జా, సినిమా కరియర్ ని మాత్రం బాలీవుడ్ తో బిగిన్ చేసింది. హిందీలో పాతిక సినిమాలకు పైగా నటించిన దియా మీర్జా, ఇప్పటి వరకు తలుగు సినిమాలో కనిపించలేదు. ఇప్పుడు ‘వైల్డ్ డాగ్ లో పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లో కనిపించబోతుంది.

 

ఈ సినిమాలో నాగార్జున NIA ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీ సన్నివేశాల్ని ముంబైలో తెరకెక్కించారు మేకర్స్. ఆసిషోర్ సాల్మన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.