ఈసారి అన్నీ అక్కడే..

Monday,December 05,2016 - 12:28 by Z_CLU

స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సెంటిమెంట్ తో ముందుకెళ్తున్నారు. తాజాగా ధృవ విషయంలోనూ ఓ సెంటిమెంట్ ఫాలో అయ్యారు మెగా ప్రొడ్యూసర్. ‘సరైనోడు’ సినిమా కు సంబంధించి ఆడియో రిలీజ్ ఫంక్షన్ నిర్వహించకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా నిర్వహించిన అల్లు అరవింద్ తాజాగా ధృవ విషయం లోనూ ఆడియో రిలీజ్ కి బదులు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను సెలబ్రేట్ చేసి సెంటిమెంట్ తో ముందుకెళ్లారు.

అయితే ధృవ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను కూడా వైజాగ్ లోనే నిర్వహిస్తారని అంతా అనుకున్నారు. కానీ పోలీస్ కథాంశంతో తెరకెక్కింది కాబట్టి, పోలీస్ లైన్స్ లో ఫంక్షన్ పెట్టారు. కానీ వైజాగ్ కనెక్షన్ మాత్రం వదల్లేనని అంటున్నారు అల్లు అరవింద్. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను హైదరాబాద్ పోలీస్ లైన్స్ లో పెట్టినా… ధృవ సక్సెస్ మీట్ మాత్రం వైజాగ్ లోనే ఉంటుందని ప్రకటించారు. సో… త్వరలోనే ధృవ మూవీకి సంబంధించి మరో గ్రాండ్ ఈవెంట్ ఉందన్నమాట.