ధృవ సీక్రెట్స్ పార్ట్-3

Tuesday,December 06,2016 - 07:35 by Z_CLU

రోజుకో సెన్సేషన్ తో కేక పుట్టిస్తోంది ధృవ మూవీ. ఓవైపు రకుల్ ప్రీత్ సింగ్ హాట్ స్టిల్స్. మరోవైపు రామ్ చరణ్ స్టయిలిష్ ఎప్పీయరెన్స్. ఇంకోవైపు సెగలు రేపుతున్న ట్రయిలర్… ఇలా ఇన్ని హాాట్ ఎలిమెంట్స్ తో ఫిలింనగర్ ను హీటెక్కిస్తున్న ధృవ… కంటెంట్ పరంగా కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంటర్వ్యూలు మొదలయ్యాయి. దర్శకుడు సురేందర్ రెడ్డితో ఈ ప్రచారం షురూ అయింది. ఈ సందర్భంగా ధృవ సినిమాకు సంబంధించి మరిన్ని సీక్రెట్స్ బయటపడుతున్నాయి.

ధృవ సీక్రెట్స్ పార్ట్-3లో భాగంగా ఈరోజు ఇంకొన్ని సీక్రెట్స్ చూద్దాం. ఏ రీమేక్ అయినా తెలుగులోకి వచ్చేసరికి అంతో ఇంతో మార్పులు చూస్తుంటాం. నేటివిటీ కోసం తప్పనిసరి అని అంటుంటారు మేకర్స్. కానీ ధృవ మాత్రం దీనికి మినహాయింపు. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ ను ఏమాత్రం టచ్ చేయలేదు. మక్కికి మక్కి దింపారు. ఈ సీక్రెట్ ను విషయాాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పాడు. పవర్ ఫుల్ స్టోరీలైన్, పక్కా స్క్రీన్ ప్లేతో వచ్చిన థని ఒరువన్ సినిమాలో ఎలాంటి మార్పులు చేయలేకపోయాానని ఒప్పుకున్నాడు సురేందర్ రెడ్డి.

మరిన్ని ధృవ సీక్రెట్స్ కోసం… Stay Tuned…