ధృవ సీక్రెట్స్ పార్ట్ - 4

Wednesday,December 07,2016 - 01:00 by Z_CLU

స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ధృవ చుట్టూరా హై టెన్షన్ ఫీవర్ అలుముకుంటుంది. సరికొత్త లుక్ తో ఎంటర్ టైన్ చేయబోతున్న ‘ధృవ’ తమిళ్ బ్లాక్ బస్టర్ కి రీమేకే అయినా, ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ టైప్ ఎంటర్ టైనర్ ప్లాన్ చేసుకున్నాడు చెర్రీ.

ధృవ పార్ట్ – 4 హైలెట్ అయ్యే ఎలిమెంట్ చెర్రీ సిక్స్ ప్యాక్ లుక్. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తున్న రామ్ చరణ్, తన కరియర్ లోనే ఫస్ట్ టైం సిక్స్ ప్యాక్ తో కనిపిస్తున్నాడు. ధృవ క్యారెక్టర్ ఎంతవరకు సిక్స్ ప్యాక్ ని డిమాండ్ చేస్తుందో తెలీదు కానీ, మగధీర లాంటి బ్లాక్ బస్టర్స్ లోను హ్యాండ్ సమ్ హంక్ గా కనిపించిన చెర్రీ, తన కరియర్ లో ఏ సినిమా కోసం కూడా సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేయలేదు.