ధృవ సీక్రెట్స్ – 2

Monday,December 05,2016 - 01:00 by Z_CLU

హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య తెరకెక్కిన ‘ధృవ’  డిసెంబర్ 9 న థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. ఓ వైపు డీ మానిటైజేషన్ ఎఫెక్ట్ తో దేశం అతలా కుతలం అవుతున్నా, ఏ మాత్రం జంకకుండా, అంతే కాన్ఫిడెంట్ గా సినిమాని రిలీజ్ చేసేస్తుంది సినిమా యూనిట్. ఆ కాన్ఫిడెన్స్ వెనక ఉన్న అసలు సీక్రెట్ ఇంకొకటుంది.

రామ్ చరణ్ బర్త్ డేట్ 9. అలాగని జస్ట్ ఆ ఒక్క రీజన్ తోనే ఈ నిర్ణయం తీసుకోలేదు సినిమా యూనిట్. చరణ్ కారు నెంబర్ కూడా తొమ్మిదే. ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మొదలు పెడితే, దానికి దగ్గరలో 9 ఉంటే దానినే ప్రిఫర్ చేసే చరణ్, ఈ సినిమాకి కూడా తన లక్కీ నెంబర్ 9 నే ఎంచుకున్నాడు.