ప్రచారం మొదలైంది...

Wednesday,November 30,2016 - 02:37 by Z_CLU

ధృవ సినిమాకు సంబంధించి ఒక్కొక్కటిగా హంగామా మొదలైంది. సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ-రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. ఇప్పుడు ఫ్రెష్ గా ప్రచారం కూడా మొదలుపెట్టారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ధృవ సినిమాకు సంబంధించి టీవీ ఇంటర్వ్యూస్ స్టార్ట్ చేశాడు. ఇవాళ్టి నుంచి థియేటర్స్ లో సినిమా రిలీజయ్యే రోజు వరకు రోజుకో కొత్త యాంగిల్ లో సినిమాకు ప్రచారం కల్పించాలని నిర్ణయించారు.

dhruva-promotion

నిజానికి ధృవ సినిమాకు ప్రచారం అక్కర్లేదు. ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న ముూవీ ఇది. తమిళ్ లో హిట్ అయిన థని ఒరువన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి స్టయిలిష్ గా పిక్చరైజ్ చేశాడు. డిసెంబర్ 9న ధృవ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవుతుంది.