ధృవ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఎక్కడ?

Thursday,November 10,2016 - 02:30 by Z_CLU

‘ధృవ’ ఆడియో రిలీజ్ అయింది. ఆడియో ను డైరెక్ట్ గా మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. లేటెస్ట్ గా విడుదలైన ఈ పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ సినిమాకు ఆడియో వేడుక ఉండదని రిలీజ్ కి ముందు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటుచేస్తామని నిర్మాత అల్లు అరవింద్ ఇప్పటికే చెప్పారు.

సరైనోడు సినిమాకు కూడా ఆడియో ఫంక్షన్ పెట్టలేదు. రిలీజ్ కి ముందు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటుచేశారు. ఆ ఫంక్షన్ కు మంచి రెస్పాన్స్ రావడం, సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో ఇప్పుడు ధృవ సినిమాకి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవ్వనున్నారట.

sarrainodu-function

సరైనోడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను వైజాగ్ లో గ్రాండ్ గా నిర్వహించిన అల్లు అరవింద్… ఈసారి ధృవ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఎక్కడ నిర్వహిస్తారా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు మెగా ఫాన్స్. సరైనోడుకు కలిసొచ్చిన వైజాగ్ నే సెంటిమెంట్ గా మరోసారి సెలక్ట్ చేసుకుంటారా.. లేక రొటీన్ గా హైదరాబాద్ లోనే ఫంక్షన్ పెడతారా అనేది చూడాలి. ఈ రెండు లొకేషన్లతో పాటు… వరంగల్ లేదా విజయవాడ లో ఫంక్షన్ పెడితే ఎలా ఉంటుందా అనే యాంగిల్ లో కూడా ఆలోచిస్తున్నారట.