ధృవ సెన్సార్ కంప్లీట్

Monday,November 21,2016 - 04:33 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ధృవ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. సురేేందర్ రెడ్డి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో చెర్రీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాను వచ్చేనెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ram-charan-dhruva

తమిళ్ లో హిట్ అయిన థని ఒరువన్ అనే సినిమాకు రీమేక్ గా ధృవ తెరకెక్కింది, హిపాప్ తమీజా అందించిన పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో ధృవ జూక్ బాక్స్ లక్షా 50వేల వ్యూస్ ను దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. మరోవైపు ఈ సినిమా ట్రయిలర్, సాంగ్ బిట్స్ కు మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. త్వరలోనే ప్రీ-రిలీజ ఫంక్షన్ పెట్టి, సినిమాకు మరింత ప్రచారం ఇవ్వబోతున్నారు.