ధృవ ఆడియో రివ్యూ

Wednesday,November 09,2016 - 12:43 by Z_CLU

ధృవ ఆడియో రిలీజయింది. సరిగ్గా రాత్రి 12 గంటలకు ఆన్ లైన్ లో ‘ధృవ’ సీజన్ స్టార్ట్ అయిపోయింది.  హిపాప్ తమీజా కంపోజ్ చేసిన ధృవ సాంగ్స్ పై జీ-సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్వూ…

dhruva-_-01

అతడే తన సైన్యం... అతడే తన ధైర్యం అంటూ సాగే టైటిల్ సాంగ్ వింటే, రామ్ చరణ్ ఈ సినిమాలో తన మోస్ట్ ఫేవరేట్ సాంగ్ అని ఎందుకు చెప్పుకున్నాడో తెలుస్తుంది. దూసుకు పోతున్నట్టుండే ట్యూన్స్ తో, చెర్రీ మేనరిజానికి ఆప్ట్ అనిపించే లిరిక్స్… ఈ పాట ఫస్ట్ టైం విన్నవాళ్ళు ఇంకోసారి విన్నాకే కానీ, రెండో పాట వినాలనుకోరు.

dhruva-_-02

చూశా చూశా చూశా పాట కంప్లీట్ గా హీరోయిన్ ఓరియంటెడ్ సాంగ్. సందర్భానుసారంగా ఉండే ఈ పాట… హీరోయిన్, హీరో తో లవ్ లో పడ్డ మూమెంట్ లో వస్తుందని తెలిసిపోతోంది. అలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి సాంగ్స్ వెరీ కామన్ అయినా, మ్యూజిక్ డైరెక్టర్ హిపాప్ తమీజా తనదైన స్టయిల్ లో ట్యూన్ చేశాడు.

dhruva-_-03

పరేషాను రా… ఈ పాట వింటుంటే ధృవ సినిమాలో కంపల్సరీ గా యాక్షన్ తో పాటు, లవ్ & రొమాంటిక్ ఎలిమెంట్స్ కి స్కోప్ కాస్త ఎక్కువగా ఉందని అనిపిస్తుంది. ప్యార్ లో పడిపోతే పరేషాను రా అంటూ సాగే ఈ పాట యూత్ ఫుల్ గా ఉంది. ఈ సాంగ్ ఇంకో రెండు మూడు రోజుల్లో యూత్ మోస్ట్ వాంటెడ్ డయలర్ ట్యూన్ గా మారడం ఖాయం.

dhruva-_-04

నీతోనే డ్యాన్స్ టు నైట్… ఈ పాటలో మెగా స్టామినా వినిపిస్తుంది… సారీ కనిపిస్తుంది. పై మూడు పాటలు సందర్భానుసారంగా, పెప్పీగా అనిపించినా రామ్ చరణ్ ఇరగదీసే స్టెప్స్ కి స్కోప్ ఉన్న సాంగ్ గా దీన్ని భావించొచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి వీడియో టీజర్ కూడా రిలీజైంది. ఫాస్ట్ బీట్ తో దూసుకుపోయే ఈ సాంగ్ థియేటర్లలో కాకరేపడం గ్యారంటీ.

జీ సినిమాలు రివ్యూ

రెగ్యులర్ గా ప్రతి సినిమాలో ఉన్నట్టు ఇందులో 6 పాటల్లేవు.  కథ, స్క్రీన్ ప్లేకు తగ్గట్టు కేవలం 4 సాంగ్స్ కు మాత్రమే చోటిచ్చారు. హిపాప్ తమీజా ఎవరో, అతడి పాటలు ఎలా ఉంటాయో చాలామంది తెలుగు ఆడియన్స్ కు తెలీదు. సరిగ్గా ఆ కొత్తదనమే ఈ పాటల్లో కనిపిస్తోంది. సినిమాకు ఇది ప్లస్ అవుతుందనడంలో ఎలాంటి డౌట్స్ లేవు.

బాటమ్ లైన్ – క్యాచీ అండ్ రీఫ్రెషింగ్