ధోని చెప్పని ప్రేమకథ

Thursday,September 29,2016 - 09:00 by Z_CLU

పొడవాటి జుట్టుతో క్రికెట్ గ్రౌండ్ లో సిక్స్ ల మీద సిక్స్ లు బాదే ధోనిని ధనాధన్ ధోని అని ముద్దుగా పిలుచుకునేవారు. ఎంత ప్రెజర్ ఉన్నప్పటికీ కూల్ గా హ్యాండిల్ చేస్తాడని క్రికెట్ ఫ్యాన్స్ కూల్ కెప్టెన్ అని కూడా పిలుచుకుంటారు. అయినా మహేంద్ర సింగ్ ధోని గురించి తెలియనిదెవరికి..? అలాంటప్పుడు యమ్. యస్. ధోనీ – The untold Story అనే బయోపిక్ అవసరమా..? అనేది బేసిక్ క్వశ్చన్. దీనికి సమాధానంగా ఓ చిన్న సిచ్యువేషన్ వివరించాడు ధోనీ క్యారెక్టర్ పోషించిన  సుశాంత్ సింగ్ రాజ్ పుత్.

ms-dhoni-ss-rajamouli-dhoni

    బయోపిక్ అనగానే ఒక సాధారణ టికెట్ కలెక్టర్ స్థాయి నుండి క్రికెట్ కెప్టెన్ గా తన ప్రయాణం ఎలా సాగిందో దాని గురించే ఈ సినిమా అనుకుంటారు. కానీ సినిమాలో ధోని జీవితానికి సంబంధించిన ప్రతి కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశామంటున్నాడు సుశాంత్. క్రికెట్ టీంలో ఎలాగైనా చోటు సంపాదించుకోవాలని ట్రై చేస్తున్న సమయంలో…. ఒక రోడ్డు ప్రమాదంలో ధోనీ గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది. ఆ విషయం చాలా మందికి తెలీదు. అప్పుడాయనకు గట్టిగా 20 ఏళ్ళు కూడా ఉండవు. ఆ సిచ్యువేషన్ లో నేను జస్ట్ యాక్ట్ చేశాను. నటిస్తున్నంతసేపు తననుతాను ఆ సిచ్యువేషన్ లో ఇమాజిన్ చేసుకోవడానికే భయపడ్డానంటున్నాడు సుశాంత్. ఇలాంటి గుండెని పిండే సిచ్యువేషన్స్ ఎన్నో ధోనీ జీవితంలో ఉన్నాయని.. వాటన్నిటిని తెరకెక్కించే ప్రయత్నం చేశామంటున్నాడు హీరో సుశాంత్.