ధనుష్ VIP -2 రిలీజ్ డేట్ ...

Wednesday,May 10,2017 - 02:40 by Z_CLU

ఆ మధ్య VIP సినిమాతో గ్రాండ్ హిట్ అందుకున్న ధనుష్ మరో సారి VIP -2 సినిమాతో త్వరలోనే థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. ధనుష్ నటిస్తూ నిర్మించిన ‘VIP’ సినిమా తెలుగులో రఘువరన్(బిటెక్) గా రిలీజ్ అయి ఇక్కడ కూడా గ్రాండ్ హిట్ సాధించడంతో ప్రెజెంట్ తెరకెక్కుతున్న ‘VIP -2 ‘ పై అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో కూడా భారీ అంచలున్నాయి..


ఈ సినిమాలో ధనుష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కాజోల్ హీరోయిన్ గా కనిపించనుంది.. కబాలి నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న ఈ సినిమాకు రజిని కుమార్తె రజిని దర్శకురాలు.. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా శరవేగంగా ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.. లేటెస్ట్ గా ఈ సినిమాను జులై 28 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్…