మెగా హీరో కోసం పాటపాడిన తమిళ స్టార్...

Wednesday,July 20,2016 - 06:24 by Z_CLU

సాయి ధరమ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘తిక్క’. ఈ చిత్రానికి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రోహిన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆగస్టు 13 న విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. సినిమాలో సిచ్యుయేషన్ కు తగ్గట్టు ఓ ప్రత్యేకమైన సాంగ్ ఉంది. ఆ పాటను ఎవరైనా హీరోతో పాడించాలని తమన్ భావించాడట. దీని కోసం తమిళ స్టార్ ధనుష్ ను సంప్రదించాడట. కొలవెరి పాటతో ఇప్పటికే దేశాన్ని ఓ ఊపుఊపేసిన ధనుష్… తమన్ అడిగిన వెంటనే సాయిధరమ్ తేజ సినిమాలో పాట పాడటానికి ఒప్పుకున్నాడట. అలా మెగా హీరోకు తమిళ హీరో గొంతు సెట్ అయిపోయింది. ఇటీవలే ఈ పాట రికార్డింగ్ తో పాటు షూటింగ్ కూడా పూర్తిచేశారు. త్రీ సినిమాలో కొలవరి-డి పాటతో పాటు ఇప్పటికే పలు సినిమాల్లో ధనుష్ పాటలు పాడిన సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం తెలుగులో పాట పాడిన ధనుష్… ఎంతటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.