హఠాత్తుగా ఆగిపోయిన ధనుష్ సినిమా

Friday,October 28,2016 - 12:02 by Z_CLU

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ పాటికి ధనుష్ నటించిన ధర్మయోగి సినిమా థియేటర్లలో సందడి చేయాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా తెలుగు వెర్షన్ విడుదల ఆగిపోయింది. తమిళ్ లో మాత్రం ఈరోజు భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమా… తెలుగులో మాత్రం రేపు థియేటర్లలోకి రాబోతోంది. సెన్సార్ కూడా పూర్తిచేసుకున్న ఈ సినిమా… కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఒకరోజు ఆలస్యంగా విడుదల అవుతుందని నిర్మాతలు ప్రకటించారు.

dhanush-dharma-yogi-movie-stills-03

ధనుష్ డ్యూయర్ రోల్ పోషించిన ఈ సినిమాలో త్రిష నెగెటివ్ షేడ్స్ లో కనిపించనుంది. అనుపమ పరమేశ్వరన్ మరో హీరోయిన్ గా నటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 5వందల థియేటర్లలో రేపట్నుంచి ధర్మయోగి సినిమా సందడి చేయబోతోంది.