ఎఫ్-2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్)... దేవి మ్యూజిక్

Saturday,June 09,2018 - 03:23 by Z_CLU

వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ రాబోతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఈ మధ్యే ఎఫ్-2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) అనే అనౌన్స్ చేసారు.. ఇప్పుడీ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫిక్స్ అయ్యాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు.

జూన్ లాస్ట్ వీక్ లో ఈ సినిమాకు అఫీషియల్ గా క్లాప్ కొట్టి, అదే వారం నుంచి సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన అనీల్ రావిపూడి.. తన రెగ్యులర్ స్టయిల్ లోనే ఎఫ్-2 సినిమాను  కూడా కంప్లీట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించనున్నాడు.

ఈ సినిమాలో వెంకీ సరసన తమన్న,  వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.