Mega 154 సాంగ్స్ తో అదరగొట్టనున్న దేవి

Tuesday,July 19,2022 - 02:36 by Z_CLU

Devi Sri Prasad composing extraordinary mass songs for Mega154

మెగా స్టార్ చిరంజీవి -దేవి శ్రీ ప్రసాద్ కాంబోలో చాలా హిట్ సాంగ్స్ వచ్చాయి. ‘అందరి వాడు’, ‘శంకర్ దాదా Mbbs’ , ‘శంకర్ దాదా జిందాబాద్’, ‘ఖైది నంబర్ 150’ ఇలా చిరు- దేవి కాంబోలో వచ్చిన ఆల్బమ్స్ అన్నీ హిట్టే. కొంత గ్యాప్ తర్వాత దేవి మళ్ళీ చిరంజీవి సినిమాకు వర్క్ చేస్తున్నాడు దేవి. బాబీ డైరెక్షన్ లో చిరంజీవి నటిస్తున్న సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

మెగా మాస్ కమర్షియల్ సినిమా కోసం అదిరిపోయే మాస్ సాంగ్స్ రెడీ చేస్తున్నాడట. తాజాగా దేవి మూడు సాంగ్స్ రికార్డ్ చేసి రెడీ పెట్టాడని తెలుస్తుంది. చిరంజీవి ‘ముఠా మేస్త్రి’లో కనిపించినట్లు మళ్ళీ ఊర మాస్ గెటప్ లో కనిపిస్తున్న ఈ  సినిమాలో రవితేజ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరి కాంబోలో ఓ మాస్ సాంగ్  ఉండనుందని సమాచారం. ఆ సాంగ్ కోసం దేవి చాలా కసరత్తు చేస్తున్నాడని, మళ్ళీ మెగా ఫ్యాన్స్ కి అదిరిపోయే స్పెషల్ సాంగ్ అందించనున్నాడని యూనిట్ చెప్తోంది.

ఖైదీ నంబర్ 150 సినిమాకు సాలిడ్ ఆల్బం ఇచ్చి ఎక్కడ విన్నా ఆ పాటలే పాడుకునేలా చేశాడు దేవి. మళ్ళీ ఇన్నాళ్ళకు చిరు సినిమా రావడంతో స్పెషల్ కేర్ తీసుకుంటూ మెగా ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసే ఆల్బం రెడీ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ పై నవీన్ యర్నేని , రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics