నాని తో మరో సారి

Sunday,April 23,2017 - 11:05 by Z_CLU

వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న నాని ప్రెజెంట్ నిన్ను కోరి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు నాని.. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకు MCA అనే టైటిల్ కూడా ఫిక్స్ అయిపోయింది..

అయితే లేటెస్ట్ ఈ సినిమాకి మరో సక్సెస్ ఫుల్ ఎలిమెంట్ ఆడ్ అయింది.. రీసెంట్ గా నాని దిల్ రాజు కాంబినేషన్ లో రూపొందిన ‘నేను లోకల్’ సినిమాకు దేవి శ్రీ అందించిన మ్యూజిక్ హైలైట్ గా నిలవడంతో మరో సారి ఈ సినిమాకు కూడా దేవి నే ఫైనల్ చేసాడట దిల్ రాజు. మరి ఇప్పటికే స్టార్ హీరోలకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతున్న దేవి నాని సినిమాకి మాత్రం వెంటనే ఓకే చెప్పేశాడని సమాచారం. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పై వెళ్లనుంది.