టీవీ సీరియల్ గా దేవసేన కథ

Thursday,May 11,2017 - 12:51 by Z_CLU

బాహుబలి సినిమాలో రాజమాత ‘శివగామి’ పాత్ర బాహుబలి, భల్లాల దేవలు పసిపిల్లలుగా ఉన్నప్పటి నుండి ఇంట్రడ్యూస్ అవుతుంది. కానీ సినిమాలో ఆ రేంజ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసే ఈ శివగామి ఎవరు..? ఎక్కడి నుండి వచ్చింది లాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరకాలంటే ‘The Rise Of Shivagami’ పుస్తకం చదవాల్సిందే. రెండు పార్ట్స్ లోను శివగామి క్యారెక్టర్ కి ఎక్కువ నిడివి ఇవ్వలేక, కేవలం శివగామి క్యారెక్టర్ ని టార్గెట్ చేస్తూ ఈ బుక్ ని రిలీజ్ చేసింది బాహుబలి యూనిట్.

ఇక శివగామి క్యారెక్టర్ ని కాసేపు పక్కన పెడితే , అమరేంద్ర బాహుబలి కుంతల రాజ్యం చేరకముందు దేవసేన ఏం చేసేది…? అసలామె హిస్టరీ ఏంటి..? ఈ పాయింట్స్ తో కేవలం దేవసేన క్యారెక్టర్ ని టార్గెట్ చేస్తూ టి.వి. సిరీస్ ప్లాన్ చేస్తుంది బాహుబలి టీమ్.

ప్రముఖ ఛానల్ లో ప్రసారం కానున్న ఈ టి.వి.సిరీస్ లో కార్తీక నాయర్ దేవసేన క్యారెక్టర్ లో నటిస్తుంది. తెలుగు సినిమాకి నాగ చైతన్య సినిమా ‘జోష్’ లో ఇంట్రడ్యూస్ అయిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు నేషనల్ చానల్ లో దేవసేన గా ఎట్రాక్ట్ చేయనుంది. ఆల్ రెడీ బాహుబలి సినిమాతో ఈ రేంజ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన దేవసేన క్యారెక్టర్, తన కరియర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది కార్తీక. ‘ఆరంభ్’ అనే టైటిల్ తో టెలీకాస్ట్ కానున్న ఈ టీవీ సిరీస్ కి కూాడా విజయేంద్ర ప్రసాదే కథ అందించారు.