ఆడియన్స్ కు మరోసారి థ్యాంక్స్ చెప్పిన దేవదాస్

Wednesday,October 17,2018 - 06:05 by Z_CLU

నాగ్, నాని కలిసి నటించిన దేవదాస్ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. వినాయక చవితి కానుకగా విడుదలైన ఈ సినిమా దసరా సీజన్ లో థియేటర్లలో నడుస్తోంది. కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. అందుకే ఆడియన్స్ కు మరోసారి థ్యాంక్స్ చెప్పింది దేవదాస్ యూనిట్. నాని, నాగ్, రష్మిక, శ్రీరామ్ ఆదిత్య, అశ్వనీదత్ తో పాటు మరికొంతమంది యూనిట్ సభ్యులు, ఈరోజు థ్యాంక్స్ మీట్ ఏర్పాటుచేశారు.

దేవదాస్ ను సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాడు నాని. విజయదశమి శుభాకాంక్షలు కూడా అందించాడు. నాగ్ తో నటించడం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందన్న నాని, మరోసారి సీక్వెల్ టాపిక్ తీసుకొచ్చాడు. నాగ్ ఓకే అంటే సీక్వెల్ చేద్దామంటూ ఆఫర్ చేశాడు.

అటు నాగార్జున కూడా ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్పాడు. తను క్వాలిటీ ఆఫ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నానని, దానికి దేవదాస్ విజయం కూడా ఓ కారణని అన్నాడు. నాని మంచి నటుడు మాత్రమే కాదని, మంచి వ్యక్తి అని మెచ్చుకున్నాడు. దేవదాస్ కు సీక్వెల్ చేయడం తనకూ ఇష్టమేనని ప్రకటించాడు.