దేవదాస్ ఫస్ట్ డే కలెక్షన్

Friday,September 28,2018 - 01:18 by Z_CLU

మొదటి రోజు దేవ, దాస్ కలిసి మేజిక్ చేశారు. బాక్సాఫీస్ ను రఫ్ఫాడించారు. నాగ్, నాని కలిసి నటించిన ఈ సినిమాకు ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 4 కోట్ల 67 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

శ్రీరామ్ ఆదిత్య డైరక్షన్ లో తెరకెక్కిన దేవదాస్ సినిమాకు మొదటి రోజే హిట్ టాక్ వచ్చింది. సో.. ఈ వీకెండ్ దేవదాస్ సినిమాకు కళ్లుచెదిరే వసూళ్లు రావడం గ్యారెంటీ. మరోవైపు సోమవారం నుంచి ఈ సినిమాకు నైజాం, సెడెడ్ లో మరిన్ని థియేటర్లు పెరిగే ఛాన్స్ ఉంది.

ఏపీ,నైజాం ఫస్ట్ డే షేర్
నైజాం – రూ. 1.68 కోట్లు
సీడెడ్ – రూ. 0.73 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.58 కోట్లు
ఈస్ట్ – రూ. 0.39 కోట్లు
వెస్ట్ – రూ. 0.26 కోట్లు
గుంటూరు – రూ. 0.52 కోట్లు
కృష్ణా – రూ. 0.32 కోట్లు
నెల్లూరు – రూ. 0.19 కోట్లు