దేవదాస్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,October 01,2018 - 12:24 by Z_CLU

దేవ,దాస్ కలిసి ఫస్ట్ వీకెండ్ అదరగొట్టారు. తమ ఆన్ స్క్రీన్ ప్రజెన్స్ తో సినిమాను హిట్ చేశారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన దేవదాస్ సినిమా సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది. విడుదలైన ఈ 4 రోజుల్లో సినిమాకు వరల్డ్ వైడ్ 16 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 11 కోట్ల 45 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

వీకెండ్ తో పాటు దేవదాస్ కు మరో గోల్డెన్ ఛాన్స్ కూడా దక్కింది. అక్టోబర్ 2 గాంధీ జయంతి పబ్లిక్ హాలిడే రావడం ఈ సినిమాకు అనుకోకుండా కలిసొచ్చింది. దీంతో దేవదాస్ కు మరిన్ని వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా షేర్ ఇలా ఉంది..

ఏపీ, నైజాం ఫస్ట్ వీకెండ్ (4 రోజులు) షేర్
నైజాం – రూ. 4.21 కోట్లు
సీడెడ్ – రూ. 1.70 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.60 కోట్లు
ఈస్ట్ – రూ. 0.84 కోట్లు
వెస్ట్ – రూ. 0.62 కోట్లు
గుంటూరు – రూ. 1.13 కోట్లు
కృష్ణా – రూ. 0.92 కోట్లు
నెల్లూరు – రూ. 0.43 కోట్లు