50 కోట్లు కొల్లగొట్టిన దేవదాస్

Friday,October 12,2018 - 01:24 by Z_CLU

థియేటర్లలో దేవ, దాస్ మేజిక్ కొనసాగుతూనే ఉంది. నాని, నాగ్ కలిసి నటించిన ఈ సినిమా సూపర్ హిట్ వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన ఫస్ట్ వీకెండ్ కే 40 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన ఈ సినిమా, తాజాగా 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది.

శ్రీరామ్ ఆదిత్య డైరక్ట్ చేసిన ఈ సినిమా కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులకు వినోదం అందించింది. ఓవైపు యాక్షన్, మరోవైపు ఎంటర్ టైన్ మెంట్ రెండూ మిక్స్ చేస్తూ పెర్ ఫెక్ట్ మూవీ అనిపించుకుంది. నాగ్-నాని ఆన్ స్క్రీన్ ఎప్పీయరెన్స్, వాళ్లిద్దరి యాక్టింగ్ స్పెషల్ ఎట్రాక్షన్.

వైజయంతీ మూవీస్ బ్యానర్ అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. రష్మిక, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా నటించారు.