నాగ్, నాని కెరీర్ లో భారీ రిలీజ్ ఇది

Monday,September 24,2018 - 12:34 by Z_CLU

నాగార్జున, నాని కలిసి నటించిన దేవదాస్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ మూవీపై చాలా బజ్ నడుస్తోంది. మరెన్నో అంచనాలు కూడా ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఓవర్సీస్ లో భారీగా విడుదలకాబోతోంది దేవదాస్. ఇంకా చెప్పాలంటే, అటు నాగార్జున, ఇటు నాని కెరీర్ లో బిగ్గెస్ట్ రిలీజ్ ఇదే.

యూఎస్ లో 180కి పైగా లొకేషన్లలో ఈ సినిమా ప్రీమియర్స్ ను ప్లాన్ చేశారు. ఫ్లై-హై సినిమాస్ కంపెనీ ఈ మూవీని ఓవర్సీస్ లో విడుదల చేస్తోంది. ఈనెల 26న అక్కడ ప్రీమియర్స్ మొదలుకాబోతున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అవ్వడంతో పాటు.. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే మెయిన్ సెంటర్లలో ఆల్రెడీ టిక్కెట్లు కూడా అయిపోయాయి.

సాధారణంగా మల్టీస్టారర్ అంటే ఓ యాక్షన్, ఇంకాస్త ఎమోషన్ ఆశిస్తారు జనాలు. కానీ దీనికి కాస్త భిన్నంగా తెరకెక్కింది దేవదాస్ సినిమా. సినిమాలో యాక్షన్ కంటే ఫన్ ఎక్కువగా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. నాగ్, నాని ఇద్దరూ తమ కామెడీ టైమింగ్ తో అదరగొట్టారట. అందుకే దేవదాస్ పై అన్ని అంచనాలు.