మరికొన్ని గంటల్లో దేవదాస్ ఆడియో రిలీజ్

Thursday,September 20,2018 - 11:46 by Z_CLU

నాగార్జున, నాని కలిసి నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ దేవదాస్ హంగామా మరికొన్ని గంటల్లో షురూకానుంది. ఈరోజు ఈ సినిమా పాటల్ని గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

దేవదాస్ సినిమాకు సంబంధించి ఇప్పటికే 4 సింగిల్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. వీటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వీటితో పాటు మిగతా పాటలతో టోటల్ జ్యూక్ బాక్స్ ను మరికాసేపట్లో విడుదల చేయబోతున్నారు. ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో నాగ్, నాని ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. టీజర్, ఫస్ట్ లుక్, సాంగ్స్ తో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. మరో వారం రోజుల్లో (27న) ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది దేవదాస్ చిత్రం.