వచ్చే ఏడాది 'డిటెక్టివ్‌' సీక్వెల్

Monday,November 06,2017 - 11:18 by Z_CLU

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడుగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సమర్పణలో మిస్కిన్‌ దర్శకత్వంలో జి.హరి నిర్మించిన సస్పెన్స్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘డిటెక్టివ్‌’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్‌ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా తన కెరీర్ బెస్ట్ అవుతుందని అంటున్నాడు విశాల్.

మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ – ” డిటెక్టివ్ సినిమా మంచి థ్రిల్లర్‌, ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. నాకు నటుడిగా మంచి పేరు, నిర్మాతగా మంచి కలెక్షన్స్‌ సాధించి పెట్టిన చిత్రమిది. అక్టోబర్‌ నెలలో తమిళంలో ‘తుప్పరివాలన్‌’ పేరుతో తమిళంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దర్శకుడు మిస్కిన్‌ దర్శకత్వంలో ఎనిమిదేళ్లుగా పనిచేయాలని అనుకుంటూ ఉండేవాడిని. కానీ వీలుకాలేదు. చివరకు ఇప్పుడు కుదిరింది. నా కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీ ఇది. తెలుగు ఆడియెన్స్‌కు కొత్త ఫీల్‌ను ఇస్తుంది. వచ్చే ఏడాది ఈ సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్‌ చేస్తున్నాం.” అన్నారు.

తెలుగు, తమిళంలో డిటెక్టివ్ సినిమాను ఓకేసారి విడుదల చేయలేకపోయామని.. సెన్సార్ వల్లే ఈ సమస్య వచ్చిందని తెలిపాడు విశాల్. “తమిళ సినిమా సెన్సార్‌ను ముంబైకి చేంజ్‌ చేశారు. సెన్సార్‌ సర్టిఫికేట్‌ను సాధించడమంటే డిగ్రీ సర్టిఫికేట్‌ను సాధించడమనేటట్టుగా మారింది. దీంతో పాటు తెలుగులో మన సినిమాను విడుదల చేయాలనుకునే సమయానికి పెద్ద హీరో సినిమా రిలీజ్‌కు ఉంటుంది. దాన్ని వల్ల థియేటర్స్‌ విషయంలో సమస్యలుంటాయని అన్నారు విశాల్.