స్పైడర్ సినిమా మహేష్ కు అంకితం

Saturday,September 16,2017 - 12:53 by Z_CLU

హైదరాబాద్ శిల్పకళా వేదికలో స్పైడర్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. అప్పటికే విడుదలైన ట్రయిలర్ ను ఎంజాయ్ చేస్తూనే, ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను సూపర్ సక్సెస్ చేశారు అభిమానులు. స్పైడర్ యూనిట్ అంతా ఈ ఫంక్షన్ లో పాల్గొంది. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు మురుగదాస్.. స్పైడర్ సినిమాను మహేష్ కు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించాడు.

చిత్ర దర్శకుడు ఎ.ఆర్‌.మురుగదాస్‌ మాట్లాడుతూ – ”ఒక డైరెక్టర్‌కి మంచి బలం అంటే హీరోనే. స్పైడర్‌ ఎలా వచ్చిందని చాలా మంది అడిగారు. వారికి నేను చెప్పేదేంటంటే,స్పైడర్‌.. మహేష్‌బాబులా వచ్చింది. స్టయిల్‌గా, హ్యాండ్‌సమ్‌గా, డేడికేషన్‌గా సినిమా ఉంటుంది. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది. ఓ ఏడాది జరిగిన షూటింగ్‌లో 6 నెలలు నైట్‌ షూటింగే చేశాను. ఏ రోజు కూడా సార్‌..నేను రేపు ఆలస్యంగా వస్తానని మహేష్ చెప్పలేదు. అంత కమిట్‌మెంట్‌ ఉన్న హీరో‌. అందుకే మహేష్‌బాబు డేడికేషన్‌కు ఈ సినిమాను అంకితం చేస్తున్నాను.”