December స్టార్ హీరోల హంగామా !

Saturday,November 27,2021 - 10:00 by Z_CLU

December gonna favourite month for Movie Lovers

సరిగ్గా వారం రోజుల్లో డిసెంబర్ నెల ఎంటర్ అవుతోంది. ఏడాది ఆరంభం నుండి సైలెంట్ గా షూటింగ్స్ తో బిజీ అయిపోయిన స్టార్ హీరోలు ఇయర్ ఎండింగ్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు. అవును భారీ సినిమాల కోసం థియేటర్స్ వైపు చూస్తున్న సినిమా అభిమానుల కోసం వచ్చే నెల నుండి స్టార్ హీరోల హంగామా స్టార్ట్ చేయబోతున్నారు. డిసెంబర్ మొదటి వారంలో 2న బాలకృష్ణ ‘అఖండ’ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తోంది. థర్డ్ వేవ్ తర్వాత క్రేజీ కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ సినిమా కావడంతో ఈ సినిమా గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. ఇప్పటికే ప్రమోషన్ కూడా మొదలైంది. డిసెంబర్ 2 న బాలయ్య తో మొదలైన మేనియా నెల చివరి వరకూ కంటిన్యూ అవ్వనుంది.

ఇక డిసెంబర్ మొదటి వారంలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో రాజమౌళి తీస్తున్న ‘RRR’ ట్రైలర్ విడుదల కానుంది. రాజమౌళినే స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు. ట్రైలర్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఇక అదే వారంలో అల్లు అర్జున్ -సుకుమార్ క్రేజీ కాంబో ‘పుష్ప’ ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వనుంది. సినిమా డిసెంబర్ 17న రిలీజ్ కాబట్టి మొదటి వారంలో ట్రైలర్ రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. ఇక మూడో వారంలో పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ టీజర్ తో పాటు ‘రాధేశ్యామ్ ట్రైలర్ కూడా రానుందని తెలుస్తుంది. ఈ రెండూ సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలే కావడంతో రెండు మూడు వారల పాటు హంగామా జరగనుంది.

ఈ ఏడాది అంతా చిన్న సినిమాలు OTT రిలీజ్ లతో సరిపెట్టుకున్న సినిమా అభిమానులంతా వచ్చే నెల నుండి మళ్ళీ థియేటర్స్ లో భారీ సినిమాలు , స్టార్ హీరోల ప్రమోషన్స్ హంగామాతో ఫుల్ ఖుషీ అవ్వడం ఖాయం. సంక్రాంతి సినిమాల వరకూ సినిమా లవర్స్ లో అదే జోష్ ఉండబోతుంది. ఇక థియేటర్స్ లో తన సినిమాను మిస్ అవుతున్న సినిమా అభిమానులను వచ్చే నెలాఖరున ‘శ్యామ్ సింగ రాయ్’ తో థియేటర్స్ లో మీట్ అవ్వనున్నాడు నాని. అంటే బాలయ్య సినిమా నుండి నెలాఖరున వచ్చే నాని సినిమా వరకూ భారీ రిలీజ్ లు , థియేటర్స్ లో హంగామా , ప్రమోషన్స్ తో డిసెంబర్ నెల మూవీ లవర్స్ కి ఫేవరేట్ మంత్ అవ్వబోతుంది.

– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics