డెబ్యూ డైరెక్టర్స్ ....డబుల్ ఇంపాక్ట్

Wednesday,August 08,2018 - 01:44 by Z_CLU

స్టార్ డైరెక్టర్స్ హిట్టు కొట్టినా బ్లాక్ బస్టర్స్  అందుకున్నా పెద్దగా టాపిక్ అవ్వదు..అదే డెబ్యూ డైరెక్టర్ ఓ హిట్టు కొట్టి ప్రముఖుల ప్రశంసలు అందుకుంటే అది హాట్ టాపిక్ అవుతుంది…  ప్రస్తుతం ఓ ఇద్దరు డెబ్యూ  డైరెక్టర్స్ రెండు సూపర్ హిట్స్ తో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు. ప్రతీ ఫ్రైడే కొన్ని తెలుగు సినిమాలు విడుదలవుతుండడం ఇలా వచ్చి అలా వెళ్లిపోతుండడం కామన్ అయిపొయింది. కానీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘గూఢచారి’, ‘చిలసౌ’ సినిమాలు మాత్రం మొదటి షో నుండే పాజిటీవ్ టాక్ సొంతం చేసుకొని సూపర్ హిట్స్ లిస్టు లో చోటు సంపాదించుకున్నాయి.

దర్శకుడవ్వాలన్న తన పదేళ్ల కోరికను ‘చిలసౌ’ సినిమాతో తీర్చుకున్న రాహుల్, రియలిస్టిక్ ఎలిమెంట్స్ తో  అంతే సింపుల్ లవ్ స్టోరీని పిక్ చేసుకుని రిలీజ్ కి ముందే ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేసుకోగలిగాడు. ఇక గూఢచారి విషయానికి వస్తే  థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో  స్పై  థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా  శశికిరణ్ కి డెబ్యూ డైరెక్టర్ గా మంచి ప్లాట్ ఫామ్ ని క్రియేట్ చేసింది. మార్నింగ్ షో నుండే సూపర్ హిట్ టాక్ తో హంగామా చేసిన ఈ సినిమా లేటెస్ట్ గా  నాగార్జున,  మహేష్ బాబు లాంటి స్టార్స్ తో పాటు మరి కొంత మంది  ప్రశంసలు అందుకుంది.

ఈ వీక్ ఈ ఇద్దరు డెబ్యూ డైరెక్టర్స్ రెండు డిఫరెంట్ జోనర్ సినిమాలతో దర్శకులుగా సత్తా చాటి అప్ కమింగ్ డైరెక్టర్స్ కి ఇన్స్పిరేషన్ గా నిలిచారు.