కామ్రేడ్ కు కత్తిరింపులు తప్పలేదు

Monday,July 29,2019 - 12:07 by Z_CLU

డియర్ కామ్రేడ్ సినిమాకు మొదటి రోజే మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా రన్ టైమ్ ఎక్కువైందనే కామెంట్ కామన్ గా వినిపించింది. దీంతో సినిమా నిడివి తగ్గించాలని నిర్ణయించారు మేకర్స్. ఈ మేరకు 13 నిమిషాల రన్ టైమ్ ను కుదించినట్టు తెలుస్తోంది. ఇవాళ్టి నుంచి డియర్ కామ్రేడ్ ట్రిమ్ వెర్షన్ థియేటర్లలో కనిపించనుంది.

అయితే సినిమాలో 13 నిమిషాలు తగ్గించినప్పటికీ.. మరో 2 నిమిషాలు యాడ్ చేశారు. రన్ టైమ్ బాగా పెరిగిపోవడంతో సింగిల్ షాట్ లో తీసిన క్యాంటీన్ సాంగ్ ను తీసేశారు. ఇప్పుడా పాటను యాడ్ చేశారు. అలా 13 నిమిషాల రన్ టైమ్ తగ్గించి, 2 నిమిషాల క్యాంటీన్ సాంగ్ ను యాడ్ చేశారు.

తాజాగా చేసిన ఈ మార్పుచేర్పులు సినిమాకు హెల్ప్ అవుతాయని భావిస్తున్నారు మేకర్స్. నిజానికి ఈ సినిమా నెరేషన్ ఇలానే ఉంటుందని, ఇలాంటి కథల్ని కాస్త ఓపిగ్గా చూడాలని విజయ్ దేవరకొండ రిలీజైన మొదటి రోజే చెప్పుకొచ్చాడు. కానీ అందరి అభిప్రాయాల్ని గౌరవిస్తానని ప్రకటించిన విజయ్, రన్ టైమ్ తగ్గించడానికి ఒప్పుకున్నాడు.