డియర్ కామ్రేడ్ ఫస్ట్ డే కలెక్షన్

Saturday,July 27,2019 - 11:57 by Z_CLU

విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ మొదటి రోజు దుమ్ముదులిపాడు. మొదటి రోజు ఈ సినిమాకు ఏపీ, నైజాంలో ఏకంగా 7 కోట్ల 49 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఓ స్టార్ హీరోకు ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయో, ఆ రేంజ్ లో ఉన్నాయి ఈ ఫిగర్స్.

విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. దీనికి తోడు డియర్ కామ్రేడ్ పై బజ్ చాలా నడిచింది. మరోవైపు మ్యూజిక్ హిట్ అయింది. గీతగోవిందం పెయిర్ విజయ్ దేవరకొండ-రష్మిక కలిసి నటించారు. ఇలా అన్ని ఎలిమెంట్స్ కలిసిరావడంతో డియర్ కామ్రేడ్ సినిమాకు మొదటి రోజు వసూళ్లు అదిరిపోయాయి.

అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా 2 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి విజయ్ దేవరకొండ కెరీర్ లో బెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఇవన్నీ ఒకెత్తయితే, నైజాంలో ఈ సినిమాకు తొలిరోజే 3 కోట్ల రూపాయల షేర్ రావడం గ్రేట్.

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్
నైజాం – రూ. 3.02 కోట్లు
సీడెడ్ – రూ. 0.88 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.88 కోట్లు
ఈస్ట్ – రూ. 0.90 కోట్లు
వెస్ట్ – రూ. 0.53 కోట్లు
గుంటూరు – రూ. 0.62 కోట్లు
నెల్లూరు – రూ. 0.26 కోట్లు
కృష్ణా – రూ. 0.38 కోట్లు