డియర్ కామ్రేడ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,July 29,2019 - 04:25 by Z_CLU

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన డియర్ కామ్రేడ్ సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకుంది. మొదటి 3 రోజుల్లో కేవలం తెలుగు వెర్షన్ కే 19 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ వచ్చినట్టు నిర్మాతలు ప్రకటించారు. ఏపీ, నైజాం, ఓవర్సీస్ తో పాటు కర్నాటకలో తెలుగు వెర్షన్ కు వచ్చిన మొత్తం ఇది.

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ ఇది. అంతేకాదు, ఒకేసారి 4 భాషల్లో రిలీజైంది కూడా. పైగా సినిమాపై భారీ క్రేజ్ ఉండడంతో వసూళ్లు బాగా వచ్చాయంటున్నారు మేకర్స్.

ఏపీ, నైజాం 3 రోజుల షేర్
నైజాం – రూ. 5.65 కోట్లు
సీడెడ్ – రూ. 1.08 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.56 కోట్లు
ఈస్ట్ – రూ. 1.20 కోట్లు
వెస్ట్ – రూ. 0.83 కోట్లు
గుంటూరు – రూ. 1.03 కోట్లు
నెల్లూరు – రూ. 0.48 కోట్లు
కృష్ణా – రూ. 0.73 కోట్లు