మహేష్ సినిమాకు డేట్ ఫిక్స్

Saturday,January 14,2017 - 04:12 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ విడుదలకాలేదు. చాన్నాళ్లుగా వాయిదాపడుతూ వస్తున్న ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ను ఎట్టకేలకు ఫిక్స్ చేశారు. తాజా సమాచారం ప్రకారం… రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 28న మహేష్ బాబు – మురుగుదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఈ మేరకు త్వరలోనే అఫీషియల్ స్టేట్ మెంట్ రానుంది.

మహేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతోంది. ఈమధ్యే అహ్మాదాబాాద్ లో భారీ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. సంక్రాంతి తర్వాత మరో భారీ షెడ్యూల్ షురూ అవుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంభవామి అనే టైటిల్ అనుకుంటున్నారు.