ఈసారి ఏ బాంబ్ పేలుస్తాడో...

Sunday,November 20,2016 - 10:00 by Z_CLU

టాలీవుడ్ దర్శక దిగ్గజం దాసరి మరోసారి సంచలనం సృష్టించాడనికి రెడీ అవుతున్నారు.  ఎప్పుడూ ఏదో ఒక ఘాటు స్పీచ్ తో వార్తల్లో నిలిచే దాసరి ఈసారి తన భావాలను ప్రేక్షకులకు ఏకంగా ఓ పుస్తకం రూపంలో అందించాలని రెడీ అవుతున్నారు.

తాజాగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పసుపులేటి రామారావు రాసిన టి.కృష్ణ వెండితెర అరుణకిరణం అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన దాసరి… తాను కూడా మూడేళ్ళ నుండి ఓ పుస్తకం రాస్తున్నానని. ఆ పుస్తకం బయటకి రావడానికి ఇంకో ఏడాది పడుతుందని చెప్పుకొచ్చారు. అందులో తెలుగు చిత్ర పరిశ్రమ గురించి, ఇండస్ట్రీలో ప్రముఖుల గురించి ఎవ్వరికి తెలియని ఎన్నో  నిజాలు బయటపెడతానని బాంబ్ పేల్చారు. మరి ఈ పుస్తకంతో దాసరి ఎలాంటి  నిజాలు బయటపెడతారో? ఎంతటి సంచలనం సృష్టిస్తారో? చూడాలి.