దసరా సినిమాలు .....

Sunday,February 26,2017 - 11:06 by Z_CLU

టాలీవుడ్ సినిమా పండుగలంటే దసరా, సంక్రాంతి అనే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ రెండు పండగలను సినిమా స్టార్టింగ్ లోనే బుక్ చేసేసుకొని థియేటర్స్ పై కర్చీపులు వేస్తారు టాలీవుడ్ స్టార్ హీరోలు… ఈ రెండు పండగలకు స్టూడెంట్స్ కి సెలవులు ఉండటం , పైగా రెండు రాష్ట్రాల్లో పెద్ద పండగలు కావడంతో ఈ ఫెస్టివల్స్ కి టాలీవుడ్ లో భలే డిమాండ్. ఇక సంక్రాంతి సీజన్ అయిపోవడంతో లేటెస్ట్ గా ఇప్పుడు దసరా సీజన్ పై కన్నేశారు స్టార్ హీరోస్.. మరి వారెవరో ఓ లుక్కేద్దాం…


ఈ లిస్ట్ లో ముందున్నాడు నందమూరి బాలకృష్ణ.. లేటెస్ట్ గా ప్రతిష్టాత్మక 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తో సంక్రాంతి హిట్ అందుకున్న బాలయ్య తన 101 సినిమాతో విజయదశమి బరిలో నిలిచి మరో విజయం అందుకోవాలని చూస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను మార్చ్ 9న స్టార్ట్ చేయబోతున్న బాలయ్య సెప్టెంబర్ 29న ఆ సినిమాతో థియేటర్స్ లోకి రాబోతున్నాడు…


ఇక ఈ విజయదశమికి తన ప్రతిష్టాత్మక సినిమాతో థియేటర్స్ లో సందడి చేయాలనీ చూస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పటి వరకూ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినప్పటికీ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను విజయదశమి కానుకగా సెప్టెంబర్ లోనే రిలీజ్ చేయాలనీ చూస్తున్నాడు నిర్మాత కళ్యాణ్ రామ్.

ఇక ఈ ఇయర్ దసరా కి అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య కూడా బరి దిగబోతున్నాడు. ప్రెజెంట్ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న చైతు ఇటీవలే కృష్ణ మరిముత్తు అనే నూతన దర్శకుడితో ఓ సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అన్ని కుదిరితే ఈ సినిమాను విజయ దశమికి థియేటర్స్ లోకి తీసుకురావాలని చూస్తున్నారు మేకర్స్. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరగా ఫినిష్ చేసి విజయ దశమికి విజయం అందుకోవాలని చూస్తున్నాడు చైతు. వీళ్ళతో పాటు మరి కొందరు యంగ్ హీరోస్ కూడా తమ సినిమాలతో దసరా సీజన్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు..