దసరా హంగామా..

Thursday,October 06,2016 - 05:43 by Z_CLU

విజయ దశమి రోజున విజయాలు అందుకోవడానికి ప్రతి ఏటా కొన్ని సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి.

ఈ దసరాకి కూడా నాలుగు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాయి. అవేంటో? చూద్దాం..

abhinetri-5-1

ఈ దసరా బరిలో  హారర్ కామెడీ సినిమా అభినేత్రితో రెడీ అయ్యింది తమన్న. ఇప్పటి వరకూ గ్లామర్ రోల్స్ తో ఆకట్టుకున్న మిల్కీ బ్యూటీ ఈ టైపు సినిమా చేయడం ఇదే ఫస్ట్ టైం. అందుకే సినిమా పై ఆడియన్స్ లో భారీగా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. తమన్నతో పాటు ప్రభుదేవా, సోనూసూద్ నటించిన ఈ చిత్రం ట్రయిలర్స్, సాంగ్స్ అన్నీ బాగా ఎట్రాక్ట్ చేశాయి. సినిమా కచ్చితంగా హిట్ అనే టాక్ మార్కెట్ అంతటా ఉంది.

sai_22930037-1

కంప్లీట్ ప్రేమ కథా చిత్రం ‘ప్రేమమ్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అక్కినేని యువ హీరో నాగ చైతన్య. కెరీర్ ఆరంభంలో ‘ఏ మాయ చేసావే’ వంటి ప్రేమకథ తో గ్రాండ్ హిట్ అందుకున్న చైతు… ప్రేమమ్ తో మరో లవ్లీ హిట్ అందుకుంటాడనే అంటున్నాయి చిత్ర వర్గాలు. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘ప్రేమమ్’ సినిమాకు రీమేక్ ఇది.

mana-oori-ramayanam

ఈ సారి ఈ విజయ దశమికి ఓ విలక్షణమైన సినిమాతో  పోటీ పడబోతున్నాడు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ఈ సినిమాలో లీడ్ రోల్ చెయ్యడంతో పాటు తనే డైరెక్ట్ చేశాడు. అదే మన ఊరి రామాయణం. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకుడిగా ఓ గ్రాండ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు ప్రకాష్ రాజ్.

eedu-gold-ehe-movie-stills-04

ఈ దసరాకి  ‘ఈడు గోల్డ్ ఎహే’  అంటూ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు సునీల్. వీరు పోట్ల దర్శకత్వంలో సునీల్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం… దసరాకు నవ్వులు పంచుతుందని అంటున్నాడు సునీల్. ఇన్నాళ్లూ ఆడియన్స్ తన నుంచి ఏం మిస్ అయ్యారో అవన్నీ ఇందులో ఉంటాయంటున్నాడు.