రజినీకాంత్ కి ఇది వరసగా ఐదో సినిమా

Thursday,January 23,2020 - 11:02 by Z_CLU

సంక్రాంతి రేస్ లో కాన్ఫిడెంట్ గా దిగిన ‘దర్బార్’ వరల్డ్ వైడ్ గా 200 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తమిళంతో పాటు డిఫెరెంట్ భాషల్లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రజినీకాంత్ స్టామినాని ఎలివేట్ చేసింది. దీంతో వరసగా 200 కోట్లు వసూలు చేసిన సినిమాల లిస్టులో ‘దర్బార్’ కూడా చేరింది.

రిలీజైన 2 వారాల్లో 200 ఓట్లు వసూలు చేసిన దర్బార్. ఒక్క తమిళనాడులోనే 11 రోజుల్లో 83 కోట్లు వసూలు చేసింది. ఇక కర్నాటక, తెలుగు రాష్ట్రాలు, ఓవర్ సీస్ లతో కలిపి సక్సెస్ ఫుల్ 200 కోట్ల వసూలు చేసి  సంక్రాంతి విన్నర్ అనిపించుకుంది దర్బార్.

2016 లో రిలీజైన కబాలి నుండి మొదలైతే వరసగా కాలా, 2.0., పేట ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 200 కోట్లు వసూలు చేశాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి దర్బార్ కూడా చేరింది.