గ్రాండ్ గా థియేటర్లలోకొచ్చిన దర్బార్

Thursday,January 09,2020 - 11:04 by Z_CLU

ఎన్నేళ్లయినా రజనీకాంత్ సినిమాలకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ వేరు. దర్బార్ తో అది మరోసారి ప్రూవ్ అయింది. ఈరోజు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైంది దర్బార్ మూవీ. ఇంకా చెప్పాలంటే సంక్రాంతి సందడి ఈ సినిమాతోనే స్టార్ట్ అయింది. రజనీకాంత్-మురుగదాస్ ఫ్రెష్ కాంబోలో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో స్టార్ట్ అయింది.

గత చిత్రాల రిజల్ట్ తో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదలైంది దర్బార్ సినిమా. ఈ సినిమాకు ఏపీ, నైజాంలో 700కు పైగా స్క్రీన్స్ దక్కాయి. వరల్డ్ వైడ్ 8వేల స్క్రీన్స్ దక్కాయి. సో… ఓపెనింగ్స్ లో సూపర్ స్టార్ సినిమా కొత్త రికార్డులు సృష్టించే ఛాన్స్ ఉంది. ఇక బిజినెస్ పరంగా చూసుకుంటే.. వరల్డ్ వైడ్ ఈ సినిమా 196 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది.

చాన్నాళ్ల తర్వాత పోలీసాఫీసర్ పాత్ర పోషించారు రజనీకాంత్. పైగా కాస్త గ్రే-షేడ్స్ ఉన్న క్యారెక్టర్. ఆదిత్య అరుణాచలం అనే పాత్రలో రజనీకాంత్ మెస్మరైజ్ చేశాడంటున్నారు ఫ్యాన్స్. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అనిరుధ్ అదిరిపోయే సంగీతం అందించాడు. పాటలు ఇప్పటికే పెద్ద హిట్.