దూసుకెళ్తున్న 'దంగల్'

Tuesday,January 03,2017 - 03:00 by Z_CLU

అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ సినిమా ‘దంగల్’ రికార్డు కలెక్షన్స్ తో జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. మహావీర్ సింగ్ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. తొలి రోజు నుంచే తన హవా చూపించడం మొదలుపెట్టింది. తాజాగా ఈ సినిమా 2 వారాల్లో 275 కోట్లు కొల్లగొట్టింది.

రిలీజ్ రోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తో ముందుకెళ్తున్న ‘దంగల్’.. తొలి 3 రోజుల్లోనే అవలీలగా 100 కోట్లు మార్క్ అందుకొని, టోటల్ గా 106 కోట్లు తో  అమీర్ ఖాన్ కెరీర్ లో  తక్కువ రోజుల్లోనే  మరో 100 కోట్ల సినిమాగా నిలిచింది. ఓవర్సీస్ లో  ఇండియాా కంటే 2 రోజుల ముందే విడుదలై అక్కడ కూడా సత్తా చాటుతూ ముందుకెళ్తుంది. ఇక సోమవారం ఈ సినిమా 12 . 75 కోట్లు వసూళ్లు చేసి విడుదలైన రెండో వారం కూడా రికార్డు కలెక్షన్స్ తో బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ సినిమా గా నిరూపించుకుని రెండు వారాలకు గాను  275 కోట్లు కొల్లగొట్టింది.. మరి ఈ సినిమా ఇంకా ఎన్ని రికార్డులు నెలకొల్పుతుందో చూడాలి….