చైనాలో దంగల్ సునామీ

Tuesday,May 16,2017 - 12:45 by Z_CLU

సొంత గడ్డపై 400 కోట్లు కలెక్ట్ చేయడమే చాలా కష్టం. అలాంటిది చైనాలో అమీర్ ఖాన్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు. నిజానికి చైనాలో దంగల్ సినిమా ఇంత హిట్ అవుతుందని అమీర్ కూడా ఎక్స్ పెక్ట్ చేసి ఉండడు. కాకపోతే కుస్తీ పోటీలు చైనాలో కూడా పాపులర్ కాబట్టి, అమీర్ ఇంతకుముందు నటించిన పీకే సినిమా అక్కడ సూపర్ హిట్ అయింది కాబట్టి దంగల్ కు ఆటోమేటిగ్గా క్రేజ్ వచ్చేసింది. దీనికి అమీర్ చేసిన ప్రమోషన్ కూడా యాడ్ అవ్వడంతో.. దంగల్ వసూళ్లు కొత్త ఎత్తుల్ని తాకుతున్నాయి.

తాజాగా ఈ సినిమా చైనాలో 4వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది. అది కూడా కేవలం 11 రోజుల్లో కావడం విశేషం. ఈ వీకెండ్ లెక్కలు చూసుకుంటే శనివారం దంగల్ సినిమాకు 13.97 మిలియన్ డాలర్లు వచ్చాయి. అలాగే ఆదివారం 12.72 మిలియన్ డాలర్లు, సోమవారం 4.86 మిలియన్ డాలర్లు వచ్చాయి. అలా మొత్తంగా 11 రోజుల్లో రూ.417.48 కోట్లు కొల్లగొట్టింది దంగల్ మూవీ.

ఓ ఇండియన్ సినిమాకు చైనాలో ఇన్ని వసూళ్లు రావడం ఇదే గొప్ప అనుకుంటే ఈ మూవీ ఏకంగా 5వందల కోట్ల్ క్లబ్ లోకి ఎంటర్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ వీకెండ్ నాటికి చైనాలో దంగల్ సినిమా 500 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయం. ఎందుకంటే, అక్కడి రూరల్ ఏరియాస్ లో ఈ సినిమా జనాలకు బాగా ఎక్కేసింది.