దూసుకుపోతున్న దంగల్

Saturday,May 13,2017 - 11:39 by Z_CLU

ఇండియాలో దంగల్ ఫుల్ రన్ కంప్లీట్ అయినప్పటికీ, చైనాలో మాత్రం ఇప్పుడే ఈ సినిమా హవా మొదలైంది. చైనాలో ఇది సాధిస్తున్న వసూళ్లు చూసి ఎంటైర్ ఇండియా షాక్ అవుతోంది. అమీర్ సినిమాకు చైనాలో మంచి వసూళ్లు వస్తాయనే మాట వాస్తవమే. గతంలో ఈ స్టార్ హీరో నటించిన పీకే సినిమాకు చైనాలో మంచి వసూళ్లు వచ్చాయి. కానీ దాన్ని మించి దంగల్ సినిమా సరికొత్త నంబర్స్ క్రియేట్ చేస్తోంది.

అవును.. చైనాలో విడుదలైన మొదటి వారంలోనే 173 కోట్లు కలెక్ట్ చేసింది దంగల్ సినిమా. తాజాగా ఈ సినిమా వసూళ్లు 213 కోట్ల రూపాయలకు చేరాయి. తైవాన్ లో వచ్చిన వసూళ్లు కూడా యాడ్ చేస్తే ఈ లెక్క 233 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈరోజు, రేపు ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశాలున్నాయి.

తాజా కలెక్షన్లతో దంగల్ సినిమా కూడా వెయ్యి కోట్ల క్లబ్ లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు ఇండియాతో కలుపుకొని 978 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. సో.. మరో 2 రోజుల్లో బాహుబలి-2 సినిమాతో పాటు దంగల్ కూడా వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరబోతోందన్నమాట.