దంగల్ లేటెస్ట్ వరల్డ్ వైడ్ వసూళ్లు

Saturday,June 03,2017 - 03:02 by Z_CLU

అమీర్ నటించిన సెన్సేషనల్ మూవీ దంగల్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఇప్పటికే బాహుబలి-2 సినిమాను క్రాస్ చేసిన ఈ మూవీ తాజాగా ప్రపంచవ్యాప్త వసూళ్లలో 1800 కోట్ల క్లబ్ లోకి ఎంటరైంది. చైనా, తైవాన్ లో నిన్నటి వసూళ్లతో కలుపుకొని వరల్డ్ వైడ్ 1823 కోట్ల రూపాయలు ఆర్జించింది దంగల్ సినిమా.

ఒక్క చైనాలోనే ఈ సినిమాకు వెయ్యి కోట్ల రూపాయలు వచ్చాయి. ఓ ఇండియన్ సినిమాకు చైనాలో వెయ్యి కోట్లు రావడం ఇదే ఫస్ట్ టైం. కేవలం చైనాలోనే కాదు.. పరాయి దేశంలో ఏ భారతీయ సినిమాకు ఇప్పటివరకు వెయ్యి కోట్ల రూపాయలు రాలేదు. దంగల్ సినిమా ఆ అరుదైన రికార్డు సాధించి చూపించింది.

మరో వారం రోజుల్లో ఈ సినిమా 2000 కోట్ల రూపాయల క్లబ్ ను కూడా క్రియేట్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. చైనాలో ఈ సినిమా ప్రదర్శనకు అదనంగా మరో 3 వారాల టైం కేటాయించారు. సో.. ఈ 3 వారాల్లో ఈ సినిమా కచ్చితంగా 2000 కోట్ల రూపాయల క్లబ్ లోకి ఎంటర్ అవుతుంది. అదే కనుక జరిగితే దంగల్ ను మరో సినిమా ఇప్పట్లో టచ్ చేయలేకపోవచ్చు.