చైనాలో కొనసాగుతున్న దంగల్ ప్రభంజనం

Thursday,May 25,2017 - 03:55 by Z_CLU

అమీర్ నటించిన దంగల్ సినిమా చైనాలో కళ్లుచెదిరే వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలై 3 వారాలైనా ఈ సినిమా హవా అక్కడ ఏమాత్రం తగ్గలేదు. అర్బన్, రూరల్, సెమీ-అర్బన్ అనే తేడాలేకుండా దేశవ్యాప్తంగా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు, ఈ వీకెండ్ కు అక్కడ దంగల్ కోసం మరిన్ని థియేటర్లు కేటాయిస్తున్నారు.

నిన్నటికి చైనాలో ఈ సినిమా వసూళ్లు 793 కోట్ల రూపాయలకు చేరాయి. అటు తైవాన్ కలెక్షన్లు కూడా కలుపుకుంటే లెక్క 820 కోట్లకు చేరింది. ఇంకో వారం రోజులు గట్టిగా ఆడితే భారతదేశం వెలుపల వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా దంగల్ సినిమా సరికొత్త రికార్డు సృష్టించనుంది.

ఇక ప్రపంచవ్యాప్త వసూళ్ల విషయానికొస్తే దాదాపు బాహుబలి-2 దగ్గరకు వచ్చేసింది దంగల్. ప్రస్తుతం ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ 1563 కోట్ల రూపాయలు.